ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మిస్టర్ బచ్చన్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 02:18 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా యొక్క షూటింగ్ 80% పూర్తి అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ లక్నోలో నాన్ లీడ్ యాక్టర్స్ తో జరుగుతున్నట్లు సమాచారం.


రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com