ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : తలపతి 67లో త్రిష..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 02:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన 67వ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అప్డేట్ కోసం తలపతి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి క్యాస్ట్ ఎనౌన్స్మెంట్ చేస్తూ వస్తున్న మేకర్స్ తాజాగా హీరోయిన్ త్రిష తలపతి 67 లో భాగమని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు గతంలోనే ప్రచారం జరగ్గా, ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. పద్నాలుగేళ్ల తదుపరి తలపతి - త్రిష జంట వెండితెరపై కనిపిస్తారని తెలియడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇంకా ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, శాండీ, గౌతమ్ మీనన్, మ్యాథ్యు థామస్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్ కీలకపాత్రలు పోషిస్తున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేసారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com