మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల మోత మోగింది. దీనిపై ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చిరంజీవి డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్, ఫస్టాఫ్ ర్యాంప్, బాస్ పార్టీ సాంగ్, కామెడీ, ఇంటర్వెల్ సీన్, రవితేజ ప్రజన్స్ ఆకట్టుకున్నాయట. అయితే సెకండాఫ్ యావరేజ్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.