కోలీవుడ్ లో ఈ నెల 4వ తేదీన విడుదలైన 'లవ్ టుడే' భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 25న తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఆడియో లాంచ్ ఈవెంటును నిర్వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ 'ప్రేమ అనేది ఈ రోజుల్లో ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. ఇప్పటికి తమిళనాడులో ఒక చిన్న సినిమాగా విడుదలై 50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా థియేటర్లను షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అంటూ పేర్కొన్నారు.