ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిన్నా విడుదల వాయిదా.. మెగా లీగ్ నుండి తప్పుకున్న మంచు విష్ణు..?

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 03:56 PM

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్ చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఐతే, మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లేటెస్ట్ గా ఈ సినిమా దసరా రేస్ నుండి దీపావళి రేస్ లోకి దూకినట్టు అంటే అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్నట్టు టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయమై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com