టాలీవుడ్ మాస్ రాజా రవితేజ, కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం సంశయిస్తుంది. ఇప్పటికే రెండుమూడుసార్లు వాయిదా పడి, ఆఖరికి జూలై 29న విడుదలవడానికి సిద్ధమైంది. ఈ విషయంపై ఇండస్ట్రీలో పలురకాల పుకార్లు వినిపిస్తున్నాయి. శరత్ టేకింగ్ నచ్చని రవితేజ కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించమని ఆర్డర్ వేసాడని, రీషూట్లు జరిగిన తర్వాత కూడా రవితేజ సాటిస్ఫై అవ్వలేదని, అందుకే ఈ సినిమాను దూరం పెడుతున్నాడని..ఇలా పలురకాల రూమర్స్ ఇండస్ట్రీలో హల్చల్ చేసాయి. ఇవన్నీ కాదు, రవితేజకు నిర్మాతకు మధ్య తలెత్తిన లావాదేవీల ఇబ్బందుల వల్లే ఈ సినిమా ఆలస్యమవుతుందని మరికొందరి వాదన.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రబృందంలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చాయని, ఇకపై మూవీ ప్రమోషన్స్ లో రవితేజ చురుగ్గా పాల్గొంటారని తెలుస్తుంది. రవితేజ రంగంలోకి దిగితే ఇంకేమన్నా ఉందా.. ప్రమోషన్స్ పేరిట చిన్నపాటి జాతరే జరగబోతుంది అని రవితేజ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.