ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"జిన్నా" తో కాలు కదపనున్న ఫేమస్ కొరియోగ్రాఫర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 05:51 PM

టాలీవుడ్ యంగ్ హీరో, "మా" ప్రెసిడెంట్ మంచు విష్ణు నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోతుంది. చాలాకాలంగా సరైన హిట్లు లేక విష్ణు సినీ కెరీర్ ఏమంత బాగాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఆయన "జిన్నా" అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదలవబోతుంది. మురుగదాస్, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఇషాన్ సూర్య ఈ సినిమాకు డైరక్టర్ గా పని చేస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని ఒక పార్టీ సాంగ్ కు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డాన్స్ కంపోజ్ చెయ్యనున్నారట. ఎంగేజ్మెంట్స్ నేపథ్యంలో ఉండే ఈ పార్టీ సాంగ్ కు గణేష్ కంపోజర్ గానే కాక, విష్ణుతో కలిసి స్టెప్పులు కూడా వెయ్యనున్నాడట. అంతకుముందు ప్రేమ్ రక్షిత్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్ కూడా ఈ మూవీకి పని చేసారు. ప్రస్తుతానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపైనే విష్ణు ఆశలన్నీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com