ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపద్భాంధవుడి అవతారమెత్తిన మెగాస్టార్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 05:21 PM

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మనసు ఎంతో సున్నితమని, పది మందికి సాయం చేయడానికి సదా ముందుంటాడనే మంచి పేరు ఉంది. ఈ క్రమంలో ఆయన బ్లడ్ బ్యాంకు ను, ట్రస్ట్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇవికాక, కోవిడ్ టైం లో ఎంతోమంది సినీ కార్మికులకు అండగా నిలిచిన గొప్ప హృదయం చిరు సొంతం.
తాజాగా ఒక ఫోటో జర్నలిస్టుకు ఆయన చేసిన సాయం మరోసారి చిరు గొప్ప హృదయాన్ని అందరికి తెలియచేస్తుంది. ఒక ప్రముఖ వార్తాపత్రికలో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టు సడెన్గా అస్వస్థతకు గురికావడంతో, తక్షణ వైద్య సదుపాయ అవసరం పడింది. ఇది తెలుసుకున్న చిరు సానుకూలంగా స్పందించి, ఆ జర్నలిస్టుకు అవసరమైన వైద్య సేవలకు అవసరమయ్యే పూర్తి ఖర్చును తాను పెట్టుకుంటానని ముందుకొచ్చారట. వైద్యులు అందించిన చికిత్సతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిన ఆ జర్నలిస్టు ప్రస్తుతం చక్కగా తన పని తాను చేసుకుంటున్నాడట. ఆ ఫోటో జర్నలిస్టు జీవితంలో ఆపద్భాంధవుడిగా మారిన చిరును ఆయన అభిమానులు ఒక రేంజులో పొగిడేస్తూ, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com