ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రియల్ లైఫ్ పాత్రలనే 'సమ్మతమే' లో పోషించాం - కిరణ్ అబ్బవరం

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 05:05 PM

యువహీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం "సమ్మతమే". కొత్త దర్శకుడు గోపినాధ్ రెడ్డి డైరెక్షన్లో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతమందించారు.
రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సమ్మతమే టైటిల్ ను బట్టి ఈ సినిమా క్లాస్ గా ఉంటుంది కానీ అందులో తన పాత్ర క్లాస్సి మాస్ తరహాలో ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో ఏకంగా 7పాటలున్నాయని, అన్నీకూడా కధకనుగుణంగానే వస్తుంటాయని చెప్పారు. సినిమాలో హీరోయిన్ చాందిని ఎంత పోష్ గా ఉంటుందో, రియల్ లైఫ్ లో కూడా అంతే పోష్ గా ఉంటూ, ఇంగ్లీష్ మాట్లాడుతుందని చెప్పారు. తాను సినిమాలో ఎంత సిగ్గరో బయట కూడా అంతే అని చెప్పారు. క్లైమాక్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందని, ఏ పాయింట్ ఐతే సినిమాలో డిస్కస్ చెయ్యడం జరిగిందో, ఆ పాయింట్ అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com