ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7డేస్ 6నైట్స్ నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 04:31 PM

తూనీగ తూనీగ, అంతకుముందు ఆ తర్వాత, కేరింత వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లతో ఆకట్టుకున్న యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నటిస్తున్న కొత్త చిత్రం 7డేస్ 6నైట్స్. సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన రెండవ సినిమా ఇది. ఈ మూవీ జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం డర్టీ హరి సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. విడుదలకు ఇంకా నాలుగు రోజులే సమయముండడంతో ప్రమోషన్స్ ను ముమ్మరం చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. గతంలో రెండు ట్రైలర్ లను రిలీజ్ చేసిన చిత్రబృందం ఈ రోజు రిలీజ్ ట్రైలర్ పేరిట మూడో ట్రైలర్ ను రిలీజ్ చేసారు. వల్గారిటీకి తావు లేకుండా, పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా, సిట్యుయేషనల్ కామెడీతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ మూవీలో సుమంత్ అశ్విన్ తో పాటు మెహర్ చాహల్, రోహన్, కృత్తికా శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఎమ్మెస్ రాజు సొంత బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ , రజనీకాంత్  నిర్మించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com