ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ "ది వారియర్" నుండి 'విజిల్' సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 04:13 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే వెండితెరపై వారియర్ గా కనిపించి అలరించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న థియేటర్లలో విడుదల కాబోతుంది.  విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో బుల్లెట్, దడ దడ అనే లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సినిమా నుండి మూడో లిరికల్ పాటను రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం సెట్ చేసారు. విజిల్ అనే పేరుతో ఈ పాటను జూన్ 22వ తేదీన సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు రిలీజ్ చేస్తామని తెలుపుతూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. పోస్టర్ ను బట్టి చూస్తే, ఈ పాట మంచి పెప్పి నెంబర్ గా ఉండనుంది.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా, నదియా ముఖ్యపాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com