ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"తలపతి 66" టైటిల్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:43 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి  తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా "తలపతి66" అని టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి తెలుగులో 'వారసుడు' తమిళంలో 'వరిస్సు' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్‌ని విజయ్‌ పుట్టినరోజున మూవీ మేకర్స్ ప్రకటించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com