ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:45 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా 13.5 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com