అక్కినేని నాగ చైతన్య "బంగార్రాజు", "లవ్ స్టోరీ" సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నా "థాంక్యూ" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం చూస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా జూలై 8న భారీగా విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. థమన్ అందించిన బీజీఎంతో టీజర్ ఫుల్ క్లాస్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.