చంద్రబాబు ఇన్నాళ్లు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ లో పెన్షన్ల హామీ మాయమైందని, చంద్రబాబుది దగాకోరు మేనిఫెస్టో అనడానికి ఇంతకంటే సాక్ష్యాలేమి కావాలని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మేనిఫెస్టోలో నాలుగు వేల పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయింది. ఈ రోజు అసలు కనిపంచనే లేదన్నారు. ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయిందని ధ్వజమెత్తారు. ఇంతకు ముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలుపెట్టాడని విమర్శించారు.