ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'F3' సన్నివేశాలలో ఒకదాన్ని వెల్లడించిన అనిల్ రావిపూడి

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:06 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..... వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఇంట్రడక్షన్ స్కీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయని అంటున్నారు. వెంకటేష్ కి నైట్ బ్లైండ్నెస్ అండ్ వరుణ్‌కు నత్తిగా మాట్లాడే సమస్యలు ఉన్నాయని అనిల్ వెల్లడించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com