ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారక్ బర్త్ డే నాడు అభిమానులకు డబుల్ ధమాకా సర్ప్రైజ్?

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 01:18 PM

రాజమౌళి దర్శకత్వంలో మూడున్నరేళ్లు కష్టపడి చేసిన ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా ఘనవిజయంతో జూనియర్ ఎన్టీయార్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఇండియన్ మూవీ హిస్టరీ లోనే ఆర్ ఆర్ ఆర్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన తారక్ ఫ్యాన్ బేస్ మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకింది. 


ఆర్ ఆర్ ఆర్ విడుదలతో కాసింత రెస్ట్ మోడ్ లోకి వెళ్లిన తారక్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ నెల 20న తారక్ పుట్టినరోజు. ఈసారి తారక్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ను ఫుల్ గ్రాండ్ గా చెయ్యాలని అభిమానులు అనుకుంటున్నారు ఎందుకంటే, కరోనా కారణంగా 2020, 2021 లో ఈ వేడుకలు జరగలేదు. పైగా ఈ పుట్టినరోజుకు ఆర్ ఆర్ ఆర్ ఘనవిజయం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. 


మరోవైపు, తారక్ తన పుట్టినరోజునాడు అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వాలని పక్కా ప్రణాళిక వేస్తున్నాడట. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న NTR 30 మే 20వ తేదీన అధికారికంగా ప్రకటింబడుతుందని అందరికీ తెలుసు. ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను కూడా జరుపుకోనుంది. అయితే, ఆ రోజే NTR 31 మూవీ అప్డేట్ కూడా వస్తుందని టాక్. ఈ ప్రాజెక్ట్ ను కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com