ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ క్రికెటర్ తో తన పెళ్లి వార్తలను తీవ్రంగా ఖండించిన అతియా శెట్టి...

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 01:16 PM

బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు, హీరోయిన్ అతియా శెట్టి తన స్నేహితుడు, టీమిండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ తో ఎప్పటినుండో సన్నిహితంగానే ఉంటుంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రోజూ దర్శనమిస్తుంటాయి. బయట కూడా చెట్టాపట్టాలేసుకు తిరిగే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలపై స్పందించిన అతియా అవన్నీ కేవలం పుకార్లే అని కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలను వినీ విని విసుగొచ్చేసింది. అందుకే ఈ వార్తలను విన్నప్పుడు నవ్వి ఊరుకుంటున్నానని అతియా పేర్కొంది. 


తాను ఎవరితోనూ తిరగటంలేదని, తన కుటుంబంతో కలిసి ముంబైలోనే ఉంటున్నానని అతియా మీడియా కు తెలిపింది. అతియా - కే ఎల్ రాహుల్ ల పెళ్లి వార్తలను సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ సైతం ఇటీవల ఖండించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com