ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న 'స్టాండ్ అప్ రాహుల్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 12:52 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్‌' సినిమాతో మార్చి 18, 2022న ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంతోమోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు. వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్, మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్ భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com