వెటరన్ దర్శకుడు శోభన్ తనయుడిగా తెలుగు సినీ తెరకు పరిచయమైన హీరో సంతోష్ శోభన్. ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి వంటి చిత్రాలతో మంచి విజయాలందుకున్న సంతోష్ నటిస్తున్న కొత్త చిత్రం శ్రీదేవి.. శోభన్ బాబు. గౌరి కిషన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత ఈ సినిమాతో నిర్మాణరంగం లోకి అడుగు పెట్టారు.
ఈ మూవీ టీజర్ ను నిన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత విడుదల చేసారు. 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి ఈ సినిమా అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఆసక్తికరమైన టైటిల్, టీజర్లతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.