ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'సాలార్' అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 12:12 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన  శృతిహాసన్ నటిస్తుంది.ఈ సినిమాలో టాలెంటెడ్ తమిళ నటుడు గోపీ ఆన్‌బోర్డ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా 2023 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్‌ని ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.రవి బస్రూర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com