SSరాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు.ఈ సినిమాకు ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి.USAలో,ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 940 కంటే ఎక్కువ లొకేషన్స్ నుండి $2.8 మిలియన్లకు పైగా వసూలు చేసింది.USAలో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది.ఈ యాక్షన్ డ్రామా మూవీలో సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.