ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా భార్య చాలా గొప్ప వ్యక్తి: ట్రంప్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2017, 11:37 AM

 అమెరికా ప్రథమ మహిళగా ఉండేందుకు మెలానియా ట్రంప్‌ సిద్ధపడలేదని వస్తున్న వార్తలపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. తన భార్య చాలా గొప్ప వ్యక్తి అని, తన బాధ్యతలను ఎంతో ఇష్టంగా నిర్వరిస్తున్నారని ట్రంప్‌ అన్నారు.


అమెరికా ప్రథమ మహిళగా మెలానియా సిద్ధపడలేదని, ఆ బాధ్యతలను ఆమె ఇష్టపడటం లేదని.. అసలు తన భర్త గెలుస్తారని కూడా ఆమె అనుకోలేదంటూ ఇటీవల స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్‌.. ట్విటర్‌ వేదికగా సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మెలానియా.. దేశానికి గొప్ప ప్రథమ మహిళ. ఆమెది కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఆమె తన బాధ్యతలను ఎంతో ఇష్టపడుతున్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు అని మెలానియా నాకు చెప్పారు. ఇతరులకు కూడా ట్రంపే తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పేవారు’ అని ట్వీట్‌ చేశారు. అంతేగాక.. శ్వేతసౌధంలో జరిగే కార్యక్రమాల్లోనూ మెలానియా చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com