ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాప్టిస్ట్ చర్చ్ లో కాల్పులు జరిపింది.. ఉగ్రవాది కాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2017, 11:50 AM

అమెరికాలోని టెక్సాస్ లో సదర్ ల్యాండ్ స్పింగ్స్ లోని బాప్టిస్ట్ చర్చ్ లో 50 నుంచి 60 మంది గుమికూడి ప్రార్థనలు చేస్తున్న సమయంలో సైనిక దుస్తుల్లో చొరబడి తుపాకి తూటాల వర్షం కురిపించిన డెవిన్ కెల్లీ ఉగ్రవాది కాదని అమెరికా భద్రతాధికారులు తెలిపారు. డెవిన్ కెల్లీ అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని వారు వెల్లడించారు. అయితే ఆయన ప్రవర్తన మంచిది కాకపోవడంతో విధుల నుంచి తొలగించబడ్డాడని వారు పేర్కొన్నారు. 2010 నుంచి 2014 మధ్య కాలంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వర్తించాడని వారు తెలిపారు. అతనికి, ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధాలు లేవని వారు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కేసును ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తుందని ట్రంప్ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com