ద్రావిడ విశ్వవిద్యాలయంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు ఈ నెల 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్‌రెడ్డి తెలియజేశారు. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జువాలజీ సోషల్ వర్క్ విభాగాలలో ఒక్కొక్కటి. మైక్రోబయాలజీ విభాగంలో రెండు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని అయన తెలియచేశారు. ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు ఫోటోలను తీసుకురావాల్సి ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్దతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ తెలిపారు.