అంతర్జాతీయ మార్కెట్ లో గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.68 శాతం పడిపోయింది. 1.86 ట్రిలియన్ డాలర్లకు క్షీణించింది. అలాగే ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా 5.61 శాతానికి తగ్గింది. 77.97 బిలియన్ డాలర్లుకు క్షీణించింది. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్‌లో మొత్తం వాల్యూమ్ 12.73 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 24 గంటల క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వాల్యూమ్‌లో ఇది 16.32 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు. పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ధర పెరిగింది. గడిచిన 24 గంటల్లో స్వల్పంగా పైకి కదిలింది. 0.01 శాతం పెరుగుదలతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 42.15 శాతానికి ఎగసింది. బిట్ కాయిన్ రేటు ఇప్పుడు 41,238 డాలర్ల వద్ద కదలాడుతోంది. మార్చి 21 ఉదయం ఈ క్రిప్టో కరెన్సీ రేటు 41 వేల డాలర్ల మార్క్‌ను అధిగమించింది. రూపాయి పరంగా చూస్తే.. బిట్ కాయిన్ ధర 0.86 శాతం తగ్గింది. రూ. 32,31,285 వద్ద కదలాడుతోంది.