పెగాసస్ పై ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా పెగాసస్ పై 2 రోజుల్లో హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో పెగాసస్ పై చర్చ జరిగింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.