అశ్వాపురం మండలంలో పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మల్లిఖార్జున్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. సుమారు 3 నుంచి 9 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు.