ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హస్తం పార్టీదే హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి హవా.. ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడి

national |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:36 PM

జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఫలితాలపైన అందరి దృష్టి పడింది. అయితే, తుది ఫలితాల వెల్లడికి ఇంకా సమయం ఉండటంతో.. ఎగ్జిట్ పోల్స్ అంచనా ఏం చెబుతాయా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్టీల దగ్గర నుంచి మొదలుపెడితే సాధారణ ప్రజల వరకు.. ఏ పార్టీకి ఎవరికి పట్టం కడతారు అనేది తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. హర్యానాలో పోలింగ్ ముగియడంతో జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తుది ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడిస్తారు. వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..


యాక్సిస్ మై ఇండియా


జమ్మూ కాశ్మీర్


కాంగ్రెస్-ఎన్‌సీ - 35-45 స్థానాలు


బీజేపీ - 24-34 స్థానాలు


పీడీపీ - 4-6 స్థానాలు


ఇతరులు - 8-23 స్థానాలు


రిపబ్లిక్ టీవీ-పీ మార్క్


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 51-61 స్థానాలు


బీజేపీ - 27-35 స్థానాలు


ఇతరులు - 3-6 స్థానాలు


 పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్


(హర్యానా)


కాంగ్రెస్ పార్టీ- 55 స్థానాలు (+/-6)


బీజేపీ - 26 స్థానాలు (+/- 6)


ఐఎన్ఎల్‌డీ - 2-3 స్థానాలు


జేజేపీ - 0-1 స్థానాలు


ఇతరులు - 3-5 స్థానాలు


హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్‌ పార్టీకి 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం కంటే తక్కువ, ఇతరులు 10 శాతం ఓట్లను పొందవచ్చని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక హర్యానా సీఎంగా సీఎల్పీ నేత భూపిందర్ సింగ్ హూడాకు 39 శాతం, ప్రస్తుత ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు 6 శాతం, ఇతరులకు 17 శాతం మంది మద్దతిచ్చారు.


జమ్మూ కాశ్మీర్


కాంగ్రెస్-ఎన్‌సీ - 46-50 స్థానాలు (ఎన్‌సీ 33-35, కాంగ్రెస్ 13-15 )


బీజేపీ - 23-27 స్థానాలు


పీడీపీ - 7-11 స్థానాలు


ఏఐపీ - 0-1 స్థానాలు


ఇతరులు - 4-5 స్థానాలు


ఇండియా టుడే- సీఓటర్ సర్వే


జమ్మూ కాశ్మీర్‌


కాంగ్రెస్-ఎన్‌సీ - 40-48 స్థానాలు


బీజేపీ - 27-32 స్థానాలు


పీడీపీ - 6-12 స్థానాలు


ఇతరులు - 6-11 స్థానాలు


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 50-58 స్థానాలు


బీజేపీ - 20-28 స్థానాలు


ఇతరులు - 10-16


ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్


జమ్మూ కాశ్మీర్‌


కాంగ్రెస్-ఎన్‌సీ - 43 స్థానాలు


బీజేపీ - 26 స్థానాలు


పీడీపీ - 8 స్థానాలు


ఇతరులు - 13 స్థానాలు


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 54 స్థానాలు


బీజేపీ - 27 స్థానాలు


ఇతరులు - 9 స్థానాలు


దైనిక్ భాస్కర్


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 44-54 స్థానాలు


బీజేపీ - 15-29 స్థానాలు


ఐఎన్ఎల్‌డీ - 1-5 స్థానాలు


జేజేపీ - 0-1 స్థానాలు


ఇతరులు - 4-9 స్థానాలు


జమ్మూ కాశ్మీర్‌


కాంగ్రెస్-ఎన్‌సీ - 35-40 స్థానాలు


బీజేపీ - 20-25 స్థానాలు


పీడీపీ - 4-7 స్థానాలు


ఇతరులు - 12-16 స్థానాలు


రిపబ్లిక్ మాట్రిజ్


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 55-62 స్థానాలు


బీజేపీ - 18-24 స్థానాలు


ఇతరులు - 2-6 స్థానాలు


జమ్మూ కాశ్మీర్‌


కాంగ్రెస్-ఎన్‌సీ - 27 స్థానాలు


బీజేపీ - 25 స్థానాలు


పీడీపీ - 28 స్థానాలు


ఇతరులు - 7 స్థానాలు


సీఎన్ఎన్


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 59 స్థానాలు


బీజేపీ - 21 స్థానాలు


ఇతరులు - 10 స్థానాలు


కేకే సర్వే


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 75 స్థానాలు


బీజేపీ - 11 స్థానాలు


ఇతరులు - 4 స్థానాలు


ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని.. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసిన కేకే సర్వేపై ప్రస్తుతం తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో ఏం జరగనుందో తెలియాలంటే అక్టోబర్ 8వ తేదీ వరకు ఆగాల్సిందే.


ధృవ్ రీసెర్చ్


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 50-64 స్థానాలు


బీజేపీ - 22-32 స్థానాలు


ఇతరులు - 2-8 స్థానాలు


జిస్ట్ టీఐఎఫ్ రీసెర్చ్


హర్యానా


కాంగ్రెస్ పార్టీ- 45-53 స్థానాలు


బీజేపీ - 29-37 స్థానాలు


ఇతరులు - 6-8 స్థానాలు


జమ్మూ కాశ్మీర్‌


జమ్మూ కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 విడతల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగ్గా.. ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. సెప్టెంబర్ 18వ తేదీన జరిగిన తొలి విడత ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడత పోలింగ్ సెప్టెంబర్ 25వ తేదీన 26 నియోజకవర్గాల్లో నిర్వహించారు. చివరి విడత ఎన్నికలు ఈనెల 1వ తేదీన మిగిలిన 40 నియోజకవర్గాలకు జరిగాయి. ఇక అక్టోబర్ 8వ తేదీన మొత్తం 90 నియోజకవర్గాల తుది ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.


గూగుల్ ట్రెండ్స్‌లో హర్యానా ఎగ్జిట్ పోల్స్


హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మూడోసారి గెలిచి పాగా వేయాలని ఆ పార్టీ చూస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీనికి తోడు రైతుల ఆందోళనల ప్రభావం ఉంది. హర్యానా రైతుల కేంద్రంగానే ఢిల్లీలో రైతుల ఉద్యమం జరిగింది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హర్యానా ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఎగ్జిట్ పోల్ హర్యానా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. హర్యానాతో పాటు చంఢీగర్, ఢిల్లీ, పంజాబ్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.


జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రముఖ వ్యక్తులు


గందెర్బల్ - నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా


నౌషీరా - బీజేపీ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రవిందర్ రైనా


నాగ్రోటా - బీజేపీ నేత దేవేందర్ సింగ్ రానా


శ్రీగుజ్వారా-బిజ్బెహరా - ఇల్తిజా ముఫ్తీ


పుల్వామా - పీడీపీ నేత వహీద్ పారా


హర్యానా


హర్యానాలోనూ 90 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. మొత్తం 90 సీట్లకు శనివారం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com