ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసోం టీ ఆకుకు...ఉక్రెయిన్ దేశాధినేత పేరు..ఎందుకో తెలుసా

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:16 PM

యుద్ద వీరుల పేర్లను కొన్ని వ్యాపార సంస్థలు తమ లాభాల కోసం వాడేసుకొంటుంటాయి. తాజాగా యూరప్ లోని ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం చేస్తున్న వేళ... అసోంకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ... ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) పేరుతో టీ పొడి (Assam Tea) ప్యాకెట్‌ని లాంచ్ చేసింది. దాని పేరును ZELENSKYY అని పెట్టింది. పేరు కింద రియల్లీ స్ట్రాంగ్ అని బై-లైన్ ఇచ్చింది. తద్వారా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ... బలమైనవారు అని చెప్పకనే చెప్పింది. ఇది బ్లెండ్ చేసిన అసోం బ్లాక్ టీ. అరోమికా టీ కంపెనీని స్థాపించిన రంజిత్ బారువా దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం జెలెన్‌స్కీకి ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ ఉంది. ప్రజల్లో ఆయనకు సంబంధించిన వార్తలపై క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఈ పేరు పెట్టారా అనే సందేహం కొందరు నెటిజన్లలో ఉంది. కంపెనీ డైరెక్టర్ బారువా మాత్రం... ధైర్యశాలి అయిన జెలెన్‌స్కీ తమకు ప్రేరణగా నిలిచారనీ... అందుకే ఆయన పేరు పెట్టామని అంటున్నారు. "ఉక్రెయిన్ నుంచి పారిపోయేందుకు అమెరికా ఇచ్చిన ఆఫర్‌ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యతిరేకించారు. ఆయన ధైర్యానికి మెచ్చి ఈ టీకి ఆ పేరు పెట్టాం. తాను పారిపోయేది లేదన్న జెలెన్‌స్కీ తనకు ఆయుధాలు కావాలని కోరారు. అది ఆయన కేరక్టర్‌ని చూపిస్తోంది. ఈ టీ ఓ సందేశాన్ని పంపుతోంది. యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటోంది" అని బారువా PTIకి తెలిపారు. బుధవారం జెలెన్‌స్క్రీ స్వయంగా అరోమికా టీ (Aromica Tea) కంపెనీ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. ఈ టీ త్వరలోనే ఈకామర్స్ సైట్లలో లభించనుంది. 200 గ్రాముల ప్యాకెట్‌ని రూ.90కి అమ్ముతున్నారు. ఈ టీకి వేరే ఏదైనా పేరు పెట్టి వుంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో... జెలెన్‌స్కీ పేరు పెట్టడంతో... ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com