రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని గౌరజూపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం ఢీ కొన్న ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం గౌరజూపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున గ్రామం బయటికి బాహిర్భూమికి నడుచుకొంటూ వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.