తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. 2018 జనవరి నెలకు సంబంధించిన 50,879 ఆర్జిత సేవా టికెట్లను తితిదే వెబ్సైట్లో ఉంచారు. 6,744 సేవా టికెట్లను ఆన్లైన్ డిప్ విధానానికి కేటాయించారు. ఇందులో సుప్రభాతం 4104, తోమాల 50, అర్చన 50, అష్టాదళ పాదపద్మారాధన సేవకు 240, నిజపాద దర్శనానికి 2300 సేవా టికెట్లు కేటాయించారు. సాధారణ పద్ధతిలో కల్యాణోత్సవానికి 10,125, వూంజల్సేవకు 2,700, వసంతోత్సవానికి 11,180, సహస్ర దీపాలంకరణ సేవకు 12,825, విశేషపూజ 1500 టికెట్లు అందుబాటులో ఉంచారు. డిప్ పద్ధతిలో ఉన్న టికెట్ల నమోదుకు వారం రోజులపాటు అవకాశం కల్పించారు.