శ్రీకాకుళం: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో సుప్రీం కోర్టు తలంటినప్పటికీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్దిరావడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజి మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసారు.
గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం హిందూజాల నుంచి యూనిట్ 3. 80 పైసలకు కొనుగోలు చేయకపోవడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని, మహానది పవర్ కంపెనీ నుంచి రూ. 4. 50 పైసలకు కొనుగోలు చేయడమేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించడం చూస్తే ప్రభుత్వ అవినీతి బట్టబయలవుతోందన్నారు.
రూ. 3. 80 పైసలకు లభించే విద్యుత్ ను వదిలి పీక్ అవర్స్ లో 19రూపాయలకు కూడా వైసిపి ప్రభుత్వం కొనుగోలు చేయడం కమీషన్ల కోసం కాదా? అధికారంలోకి వచ్చాక 32నెలల్లో ప్రజలపై 22వేల కోట్లరూపాయల భారాన్ని ఈ ప్రభుత్వం మోపిందన్నారు.
![]() |
![]() |