ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ, ముస్సోరిలో పర్యటించనున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సదస్సులో, సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ కెరీర్ ట్రైనింగ్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. రియల్ టైం గవర్నెన్స్ అమలు, ఫలితాలపై చంద్రబాబు మాట్లాడనున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.