ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రశేఖర `రాయ' తిరుమల సందర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:29 PM

 -తెలంగాణా రాష్ర్ట ముఖ్య నేతగా తొలిసారి దర్శనం


 -తన మనసులో మాటను నిజం చేసిన  శ్రీవారికి కృతజ్ఞతలు


 -1517వ సంవత్సరంలో రాయలు శ్రీవారిని దర్శించుకున్నారు


 -500 ఏళ్ల తరువాత ఇదే సంవత్సరంలో కేసిఆర్‌ తిరుమలకు


 -బహుశ ఇది ఊహించని అపూర్వ చారి్తక్ర ఘటన


తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు తిరుమల శ్రీవారిని దర్శించు కొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలం గాణా రాష్ర్టం సాకారమైతే కొండకు వచ్చి దర్శనం చేసుకొని విలువైన కానుకలు సమర్పించు కుంటానని  కె.సి.ఆర్‌, శ్రీవెంకటేశ్వర స్వామివారికి మొక్కుకున్నారు. తెలంగాణా ఏర్పాటయ్యింది. విశేషం ఏమిటంటే సరిగ్గా ఐదు శతాబ్దాల క్రితం  విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు కూడా తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని విలువైన కానుకలు సమర్పి ంచారు.  బహుశ ఇది ఊహించని అపూర్వ ఘటన. అప్పుడు కృష్ణదేవరాయలు కళింగ సామ్రాజ్యాన్ని జయించి తిరిగి వస్తూ సింహాచలం దగ్గర విజయ స్ధూపా న్ని ప్రతిష్టించి ఆ విజయోత్సాహంతో  ధరణి కోటకు వచ్చి అమరేశ్వరుని దర్శిం చుకొని స్వామివారికి తులాపురుష మహాదానాన్ని ఇచ్చి తన దేవేరులతో తిరు మల కొండకు వచ్చి, స్వామివారికి వెలకట్టలేని వజ్రాభరణాలు కానుకగా  ఇచ్చా డు. ఇప్పుడు తెలంగాణా రాష్ర్ట సాధకుడుగా, తొలి ముఖ్యమంత్రిగా చంద్ర శేఖర్‌రావు కూడా సతీసమేతంగా తిరుమలకు వచ్చి బంగారు ఆభరణాలను బహుకరిస్తున్నారు. అప్పుడు రాయలు విజయనగర రాజ్య చక్రవర్తిగా హాజర య్యాడు నేడు చంద్రశేఖరరావు తెలంగాణా రాష్ర్ట ముఖ్య నేతగా హాజరవు తున్నారు.


2001లో చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణా సాధనే ధ్యేయంగా తెలంగాణా రాష్ర్ట సమితి పార్టీని ప్రారంభించారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత 2009లో  ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణా గురించి ప్రకటన చేశారు. అయితే ఆ తరువాత సీమాంధ్రలో కూడా ఉద్యమాలు ప్రారంభం కావడంతో తెలంగాణా ఏర్పాటుపై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. తెలం గాణా ఏర్పాటు జాప్యం అవుతుందేమో అనుకుంటున్న తరుణంలో కె.సి.ఆర్‌. 2010లో తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.  `తెలంగాణా ప్రత్యేక రాష్ర్టం కల సాకారమైతే మళ్లీ మీ కొండకు వచ్చి  కానుకలు సమర్పిస్తా' అని కె.సి.ఆర్‌. స్వామివారికి మొక్కుకున్నారు. ఆ తరువాత ఉద్యమాన్ని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా కె.సి.ఆర్‌. పిలుపుకు ప్రతిస్పందిస్తూ మరింత ఊపును తీసుకొచ్చారు. ఆ తరువాత అనూహ్యంగా 2014 ఫిబ్రవరి 18న తెలంగాణా బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందింది. తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం, చంద్రశేఖరరావు  మొక్కవోని దీక్ష, పట్టుదల ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. భారత దేశంలో తెలంగాణా 29వ రాష్ర్టంగా ఆవిర్భవించింది. 2014 జూన్‌ 2వ తేదిన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా  పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత తన మనసులోని మాటను నిజం చేసిన వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారికి సమర్పించే కాను కలను  చేయించే బాధ్యతను టి.టి.డికి అప్పగించారు. ఆ నగలను తయారు  చేయడానికి కోయంబత్తూరులోని ఓ నగల వ్యాపారిని ఎంపిక చేశారు. నగలు తయారు కావడంతో కె.సి.ఆర్‌ తిరుమల పర్యటన ఖరారు చేసుకున్నారు.


దక్షిణ భారత దేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి ఘనమైన చరిత్ర ఉంది. 1336లో హరిహర రాయలు, బుక్కరాయలతో ప్రారంభమైన ఈ మహా సామ్రాజ్యం 1614 వరకు కొనసాగింది. దీనిని సంగమ, సాలువ, తుళు, ఆరవీ డు అనే నాలుగు వంశాలు పాలించాయి. తుళు వంశానికి  చెందిన కృష్ణదేవ రాయలు 1509 సింహాసనం అధిష్టించాడు. రాయ అంటే సంస్కృతంలో రాజు అని అర్ధం. విజయనగర రాజుల పేర్ల తరువాత రాయలు అని ఉంటుంది. ఇక   కృష్ణదేవరాయలు  వైష్ణవ మతాభిమాని. ఆయనకు శ్రీవెంకటేశ్వరస్వామి ఇష్ట దైవం. 1513లో రాయలు తొలిసారి తన దేవేరులు  తిరుమల దేవి, చిన్నాదే వితో కలసి శ్రీవారిని సందర్శించారు. ఆ తరువాత ఆయన రాజ్య విస్తరణ కోసం అనేక రాజ్యాలపై యుద్దం చేస్తూ తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకొని వెడుతూ ఉండేవారు. తిరుమల ఆలయాన్ని అభివృద్ది చేయించారు. విమాన గోపురానికి బంగారు పూత పూయించారు.


చంద్రశేఖరరావు తన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేస్తానని, ప్రజల జీవి తాల్లో వెలుగులు నింపుతానని ప్రకటించడమే కాకుండా ఆ దిశగా అనేక చర్య లు చేపట్టారు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధలాంటి పధకాల రచన చేసి వాటిని అమలుపరుస్తున్నారు. త్రాగునీరు, సాగునీరు, నిరంతర విద్యుత్తు, ఐ.టీ అభివృద్ది, హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లి విశ్వనగరంగా చెయ్యాలన్న పట్టుదల చంద్రశేఖరరావులో మెండుగా ఉన్నాయి. తెలంగాణా ప్రజల ఆశలను, ఆకాంక్షలను సాకారం చేసే దిశగా సాగుతున్నారు.


మధ్య యుగాలనాడు శ్రీ కృష్ణదేవరాయలు తన రాజ్యాన్ని ఒరిస్సా నుంచి గోవా వరకు విస్తరించారు. అంతే కాదు వ్యవసాయానికి చేయూత నివ్వడానికి అటు తుంగభధ్ర, ఇటు కృష్ణా నదిపై ఆనకట్టలు కట్టి నీటిని పొలాలకు మళ్లించారు. అలాగే రాజధాని హంపీ నగర వాసుల దాహార్తిని తీర్చడానికి పైపు ల ద్వారా నీటిని సరఫరా చేశారు. అలాగే రాయలు కళాపోషకుడు, కళారా దకుడు. రాజధాని హంపీ నగరంలో తుంగభద్ర నదీ సమీపంలో విఠలేశ్వర ఆలయాన్ని, అంతపురం సమీపంలో కృష్ణాలయాన్ని అద్బుత శిల్పకళకు ప్రతీకగా కట్టించారు. స్వయంగా కవి, రచయిత, ఆముక్తమాల్యద లాంటి ఫ్రౌడ కావ్యాన్ని తెలుగువారికి అందించారు. అంతేకాదు మంచి పాలనాదక్షుడు. 


ఇక చంద్రశేఖరరావుకు కళల పట్ల అభిమానం, కళాకారులంటే గౌరవం, సాహిత్యమంటే అమితమైన అభిమానం, ఉన్న చంద్రశేఖరరావు త్వరలో తన జీవిత ప్రస్ధానాన్ని తెలిపే ఆత్మకథ రాయబోతున్నారు. తెలంగాణా రా్ర,ష్టంలో దివ్యక్షేత్రమైన యాదగిరి గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని, శ్రీశ్రీశ్రీ చినజియ్యర్‌ స్వామి వారి సూచనలతో, ఈ శతాబ్దానికి తగ్గట్టు ఆధునీకరించి సరికొత్త రూపాన్నిస్తూ   యాదాద్రి అన్న సరికొత్త నామకరణం చేశారు.  తెలంగాణా రాష్ర్ట సాధనలో  జానపద కళా బృందాలు నిరంతరం శ్రమించాయి. ప్రజా గాయకులు గళమెత్తారు. ఆడారు, పాడారు, తమ ఆక్రం దనను ఢిల్లీదాకా వినిపించారు. అందరి సమష్టి కృషి ఫలితమే తెలంగాణా రాష్ర్ట ం ఏర్పాటయ్యింది. వారందరినీ మర్చిపోకుండా తెలంగాణా ప్రభుత్వం ఏర్పా టైన తర్వాత  కె.సి.ఆర్‌. కవులు, కళాకారులకు ఉద్యోగాలు కల్పించి గౌరవి ంచారు. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు, పండుగలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. బంగారు తెలంగాణా కలను సాకారం చేసే దిశగా అడుగులేస్తూ  కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. రాజకీయానుభవం ఉన్న నాయకుడు కాబట్టే పరిపాలనలో తనదైన ముద్ర వేసి అభివృద్ది పధంలో దూసుకెడుతున్నారు. 


శ్రీకృష్ణ దేవరాయలు చంద్ర వంశానికి చెందిన వాడంటారు. అలుపెరుగని యుద్దాలు చేసి, సామ్రాజ్యాన్ని విస్తరించి, తన పాలనలో  ప్రజలకు స్వర్ణయు గాన్ని చూపించి, శాంతి  మంత్రం జపిస్తూ ఐదవ పర్యాయం తిరుమల కొండకు వచ్చాడు. ఆయన వెంట తిరుమలదేవి, చిన్నాదేవి ఉన్నారు. జనవరి 2వ తేది 1517వ సంవత్సరంలో రాయలు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ రోజున రాయల వారు స్వామివారికి, అమూల్యమైన కంఠాభరణం, పచ్చల పతకాన్ని బహుకరించారు. రాణులు కూడా విలువైన కానుకలను తమ  ఇష ్టదైవానికి సమర్పించుకున్నారు.  ఆనాడు రాయలు రాజుగా తిరుమలను సందర్శించారు. సరిగ్గా ఐదు వందల సంవత్సరాల తరువాత పేరులోనే చంద్రుడుని ఇముడ్చు కున్న కె.సి.ఆర్‌. ముఖ్యమంత్రిగా తన శ్రీమతితో కలసి ఫిబ్రవరి 22వతేది 2017న శ్రీవారిని దర్శించుకొని 14.9 కిలోల బరువైన బంగారు సాలిగ్రామ హారాన్ని, 4.65 కిలోల బరువైన కంఠాభరణాన్ని బహుకరిస్తున్నారు. ఆనాడు చంద్ర వంశ రాయలు శ్రీవారికి బహుకరించిన ఆభరణాలకు ఈనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర రా(య)వు బహుకరిస్తున్న బంగారు నగలకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇది కాకతాళీయమే కావచ్చు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com