ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్, ఫేస్ బుక్ లైవ్ ఆడియో రూమ్స్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 14, 2021, 01:46 PM

ఫేస్ బుక్ ఉయోగించే యూజర్లకు గుడ్ న్యూస్. లైవ్ ఆడియో రూమ్స్ ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, డెస్క్ టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఈ ఆడియో రూమ్స్ కొంతమంది సెలబ్రెటీలకు, కొన్న గ్రూప్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్ గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియేట్ చేసి ఫీచర్ ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తున్నట్ల సమాచారం. ఫేస్ బుక్ క్లబ్, ట్విట్టర్ స్పేస్ తరహాలో ఆడియో రూమ్స్ ను క్రియేట్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.ఇందులో భాగంగా…లైవ్ ఆడియో రూమ్స్ లో స్పీకర్ గా చేరడానికి ప్రజలను ఆహ్వానించేందుకు శక్తి హోస్ట్ కు అర్హత ఉంది. స్పీకర్ చేసి సంభాషణను ఎవరైనా వినొచ్చే వీలుంది. లైవ్ ఆడియో రూమ్స్ ను గ్రూప్ అడ్మిన్స్ కంట్రోల్ చేసే అవకాశం కల్పించారు. ఈ రూమ్స్ ఫీచర్ యాప్ లో ఫేస్ బుక్ వాచ్ ట్యాబ్ దగ్గర కనిపిస్తుంది.ప్రస్తుతం ఫేస్ బుక్ లైవ్ వీడియో కేవలం 50 మంది స్పీకర్ కు మాత్రమే అనుమతినిస్తుంది. వీరు ఏం మాట్లాడుకుంటారో వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే..కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. ట్విట్టర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్ న డౌన్ లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనమే అని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com