ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ సిగలో మరో మణిహారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2017, 02:01 PM

తుపలోన్‌ విమానం మ్యూజియం
కుర్సురా జలాంతర్గామి మ్యూజియంకు తోడుగా ఏర్పాటు

హుద్‌ హుద్‌ తుఫాను దెబ్బకు విలవిల్లాడిన విశాఖపట్నం నగరం అతి తక్కువ కాలంలోనే కోలుకొని ప్రపంచం అంతా ఔరా అనిపించేటట్లు చేయటం మనం అంతా చూశాం. రెక్కలు తొడిగిన పచ్చదనం, స్వచ్ఛ భారత్‌ పథకంలో భాగంగా భారత దేశంలోని నగరాలన్నింటిలోకెల్లా పరిశుభ్రమైన నగరంగా నిలవడం ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం. సుందర, ప్రశాంత వాల్తేరు నగరానికి ఎన్నో ప్రశస్తులుండగా, ఇపుడది తూర్పు తీరంలోనే అద్భుత పర్యాటక నగరంగా వృద్ధి చెందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న ఒడిశా, బెంగాల్‌, జార్ఖండ్‌ మరియు చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల పర్యాటకులతో కాస్మోపాలిటన్‌ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

కైలాసగిరి, డాల్ఫిన్స్‌ నోస్‌, సింహాచలం, రిషికొండ, భీమిలితో పాటు భారతదేశంలోనే సుందర బీచ్‌గా పేరెన్నికగన్న రామకృష్ణ బీచ్‌ని సకుటుంబంగా వీక్షించి, సేదదీరే పర్యాటకులకు మరో కనువిందుతో నగరం ముస్తాబవుతోంది. ఇటీవలే భారతీయ వాయుసేన నుండి విరమణ చేసిన టుపలోవ్‌ టివి-40 రకానికి చెందిన భారీ విమానం, విశాఖ పర్యాటక సిగలో చేరబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈసంవత్సరం మార్చి 27న డి కమిషన్‌ చేయబడిన టుపలోన్‌ టివి-142, భారీ విమానం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పర్యాటకులకు కనువిందు చేయటానికి మ్యూజియంగా రూపుదిద్దుకోబోతోంది. ముఖ్య మంత్రి పట్టుదలతో రక్షణ శాఖని ఒప్పించి ఈ భారీ విమానం భావిత రాలకు ప్రేరణగా నిలవటానికి సామాన్య ప్రజలకు విమాన ......రంగాల మీద అవగాహన కల్పించే ఉద్దేశ్యంతోను, విశాఖ పర్యాటకానికి మరో ఊతమిచ్చేందుకుగాను ఈ విమానాన్ని త్వరలోనే రామకృష్ణ బీచ్‌లో, కుర్సురా జలాంతర్గామి మ్యూజియం పక్కన శాశ్వతంగా నిలపబోతు న్నారు. భారత తీరప్రాంత గస్తీ కోసం 1988 లో ఏర్పాటు చేయబడ్డ దళంలోని ఈ విమానం భారీ రకానికి చెందినది. 1987 లో అప్పటి సోవియట్‌ యూనియన్‌ నుంచి కొనుగోలు చేయబడ్డ ఈ విమానం ప్రపంచంలోని గస్తీ విమానాల్లోకంటే అతి పెద్దది. దూర సముద్రంలోని యుద్ధ నౌకలను శత్రు జలాంతర్గాములను ఇట్టే పసిగట్టి వాటిని నాశనం చేయగల ఈ విమానం ఒకసారి ఎగిరితే 13-14 గంటల పాటు ఏకబిగిన సముద్రాలను జల్లెడపట్టి, శత్రు జలాంతర్గాములను నాశనం చేయగల క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్నది.

జలాంతర్గామి యుద్ధ సామర్థ్యం గల వ్యవస్థతో భారత దేశ తీరాన్ని 29 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడిన ఈ విమానం కాలం తీరిన కారణంగా..... సర్వీసు నుండి విరమించింది భారత వాయుసేన. తమిళనాడులోని రాజాళి వాయుసేన స్థావరంగా సేవలందించిన ఈ విమానం మార్చి 27, 2017 నాడు సర్వీసు నుండి విరమించారు. ఇపుడు ఈ విమాన స్థానంలో బోయింగ్‌, పొయిస్‌ ఒన్‌ పి1, విమానాన్ని రంగంలోకి దించింది వాయుసేన. టుపలోన్‌ విమానం సర్వీసు విరమణ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు తన దూరదృష్టితో రక్షణ శాఖను సంప్రదించటం, ఆ విమానాన్ని మ్యూజియంగా చేయటంలోని ఔచిత్యాన్ని రక్షణశాఖ అధికారులకు వివరించటం, వారిని ఒప్పించి విశాఖకు రప్పించటం వెనుక ముఖ్య మంత్రి చాకచక్యం, చొరవ రక్షణ శాఖ అధికారులనే అబ్బురపరిచింది. భారతదేశంలో 29 రాష్ట్రాల ప్రభుత్వాలకు తట్టని ఆలోచ నను అతి వేగంగా ఆచరించిన ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖ అధికారులను అభినందించాల్సిందే. సర్వీసు నుండి విరమించిన పది రోజు లకే, ఏప్రిల్‌ 7వ తేదీ 2017 నాడు వాయుసేన అధికారులు విశాఖప ట్నంలోని ఐూఖి ఈఉఎఅ స్థావరంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు, ఇతర జలసేన అధికారుల సమక్షంలో ముఖ్య మంత్రి చంద్రబాబుకు అప్పగించారు. నాలుగు మెగా టర్బోప్రాప్‌ ఇంజన్లతో కూడిన ఈ రాక్షస విమానాన్ని నేర్పుతో సుశిక్షితు లైన సాంకేతిక నిపుణుల సాయంతో చిన్నభాగాలుగా విడగొట్టి, రామ కృష్ణ బీచ్‌ తీరానికి చేర్చి, తిరిగి అన్ని భాగాలు బిగించి పూర్తి విమానాన్ని యథాత థంగా నిలుపుతారు.  అక్టో బర్‌ నాటికి పూర్తి మ్యూజియంగా తీర్చి దిద్దే ప్రక్రియ కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు మూడు కోట్ల రూపాయల తక్కువ వ్య యంతో ఇలాంటి మహత్తరమైన కళాఖం డాన్ని ఏర్పాటు చేయటం ప్రభుత్వ ఘనత గానే చెప్పుకో వాలి. ఒక్కో ఇంజన్‌లో ఆరు బ్లేడులుండి టర్బోపోప్‌, ఒక్క బ్లేడు 18 అడు గులు..... విడగొట్టిన భాగాల్ని పెద్ద ట్రక్కుల ద్వారా బీచ్‌ ఫ్రంట్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమయింది. దసరానాటికి కుర్సురా జలాంతర్గామి మ్యూజియం పక్కన విశాఖ వాసులకు అన్ని రాష్ట్రాల పర్యాటకులకు కనువిందు చేయనున్న టుపలోవ్‌ విమానానికి సాహో!

బుద్ధ వాహక నౌకపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను
టుపలోవ్‌ విమాన ఉదంతానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రక్షణరంగ వస్తువులతో కూడిన మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కార్యరూపం లోకి తెచ్చింది. నవంబరు 2016 లో సర్వీసు విరమణ పొందిన విమాన వాహక నౌకూఖి విరాట్‌ను మ్యూజియం గాను, విలాస వంతమైన హోటల్‌గా తీర్చిదిద్దే ఉద్దే శ్యంతో, రక్షణశాఖతో సంప్ర దింపులు మొదలుపెట్టింది. 30 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన విరాట్‌ యుద్ధ వాహక నౌక ప్రస్తుతం కొచ్ఛిన్‌లోని నావల్‌ డాక్‌ యార్డులో సేదదీరింది. విరాట్‌ నౌకను మ్యూ జియం మరియు లక్సరీ హోటల్‌గా తీర్చిదిద్ది పర్యా టకులకు కనువిందు చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు రక్షణ మంత్రిత్వ శాఖతో తీవ్ర సంప్రదింపులు జరుపుచున్నారు. రక్షణశాఖ వ్యక్తం చేసిన అంశాలను, అభ్యంతరాలను పరిశీలించి, వారిని సంతృప్తిపరిచే విధంగా ప్రాజెక్ట్‌ రిపోర్టు తయారు చేయటానికిగాను, రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత కన్స ల్టెంట్‌ను నియమించుకొంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా చంద్రబాబు చొరవతో రెండు నెలల్లో ఈ అంశంపై నిర్ణయం వెలుడే అవకాశముంది. విరాట్‌ యుద్ధ వాహక నౌక విశాఖ తీరంలో నిలిచేట ట్లయితే ప్రపం చంలో అరు దైన నగరంగా విశాఖ ఖ్యాతికెక్కే అవకాశం ఉంది. కుర్సురా జలాంతర్గామి మ్యూజియం, టుపలోవ్‌ విమాన మ్యూజియం మరియు ఐూఖి విరా ట్‌ మ్యూజియంలతో విశాఖపట్నం నగరం విశ్వవిఖ్యా తమయ్యే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినం దించి తీరాల్సిందే. ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని నార్‌ ఫోక్‌లో రక్షణ రంగానికి సంబం ధించిన ప్రదర్శనశాల ఉంది. ఇప్పుడు అక్కడికంటే ఎక్కువ హంగు లతో విశాఖ అవతరించే అవకాశం ఉంది. కమాన్‌ మీ కుటుంబంతో విశాఖ తిరగటా నికి ఇప్పటి నుండే ప్లాన్‌ చేసుకోండి.


- వంకాయలపాటి రాంబాబు,
9603461500 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com