మరో 3 రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో తెలుసుకుంటే మంచిది. లేదంటే బ్యాంకు పనులకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్బీఐ ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులు వస్తున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారాలు వస్తుండగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ 6 సెలవు దినాలు ఎప్పుడూ ఉండేవే. ఇక సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి వచ్చింది. దీంతో 10, 11, 12 తేదీల్లో వరుసగా 3 రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.