కోస్టా డి కాపరికా: పోర్చుగల్‌లో ఓ విమానం బీచ్‌లో ల్యాండైంది. ఈ ఘటన కోస్టా డి కాపరికా సిటీలో జరిగింది. విమానం అకస్మాత్తుగా బీచ్‌పై దిగడం వల్ల ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదం వల్ల 8 ఏళ్ల బాలికతో పాటు 56 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. శిక్షణ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. అయితే విమానంలో ఉన్న ఇన్స్ట్రక్టర్, పైలెట్ మాత్రం క్షేమంగా ఉన్నారు.