ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌ కొత్త ప్రధానిగా షాహీద్‌ అబ్బాసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2017, 08:28 AM

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ కొత్త ప్రధానిగా షాహీద్‌ ఖకన్‌ అబ్బాసీ(58)ని నేషనల్‌ అసెంబ్లీ ఎన్నుకుంది. దేశ 18వ ప్రధానిగా మంగళవారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. 342 మంది సభ్యులు గల నేషనల్‌ అసెంబ్లీలో 221 ఓట్లు వచ్చిన అబ్బాసీ తన ముగ్గురు ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. సంపన్న వాణిజ్యవేత్త అయిన అబ్బాసీ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు అత్యంత ఆప్తుడు, బాగా నమ్మకస్తుడు. షరీఫ్‌ సొంత తమ్ముడు షెహ్‌బాజ్‌ నేషనల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యేదాకా తాత్కాలిక ప్రధానిగా షరీఫ్ ..అబ్బాసీకి అవకాశమిచ్చారు. గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన అబ్బాసీని నవాజ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌(ఎన్‌) ప్రధాని పదవికి అభ్యర్థిగా నిలబెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com