ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం మొత్తం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచి పోయింది. ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యింది. అటు సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో బీచ్‌ల వద్ద జనాన్ని అలర్ట్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఉధృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావారణ అధికారులు చెప్పారు.