ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో వింత పురుగులు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 23, 2021, 03:48 PM

గుంటూరు జిల్లాలో వింత పురుగులు కలకలంరేపుతున్నాయి. రొంపిచర్ల మండలంలో పలు గ్రామాల్లో ఈ పురుగులు సంచరిస్తున్నాయి. ఆ పురుగులు ఒంటిపై వాలినా.. కుట్టినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని వీరవట్నం సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పురుగుల దెబ్బకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుబాబుల్ తోటల వల్లే పురుగులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.. గతంలో ఎప్పుడూ ఇలాంటి వాటిని చూడలేదని రైతులు కూడా చెబుతున్నారు. ఈ పురుగులు ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com