నేటి పంచాంగం
వారం: ఆదివారం
తిథి: ద్వాదశి మ. 1.50
నక్షత్రం: ఆరుద్ర ఉ. 7.03
శుభసమయం: ఉదయం. 7.20-8.16, సాయంత్రం. 5.48-6.09
దుర్ముహూర్తము: సాయంత్రం: 4.49-5.40
వర్జ్యము: సాయంత్రం.6.53-8.25
రాశి- మేషం
పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. మొదట్లో కొన్ని వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
రాశి- వృషభం
మీ ఊహలు నిజం కాగలవు. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
రాశి- మిధునం
ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ సొంత మవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. సమాజసేవలో భాగస్వాములవుతారు.
రాశి- కర్కాటకం
చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు ఆర్జిస్తారు.
రాశి- సింహం
ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం.
రాశి- కన్య
రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.
రాశి- తుల
ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
రాశి- వృశ్చికం
సమాజంలో ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.
రాశి- ధనస్సు
పరిచయాలు మరింత పెరుగుతాయి. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై న చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
రాశి- మకరం
భూములు, ఆభరణాలు కొంటారు. మీ మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. గృహ సంబంధ విషయాల్లో జరుగుతున్న ఆలస్యం తొలగిపోతుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు.
రాశి- కుంభం
ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. కోర్టు కేసులు లేదా వివాదాల్లో గెలుపొందుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
రాశి- మీనం
పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.