ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీరు-ప్రగతి లోపించిన పురోగతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:48 AM

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : జలంతోనే అభివద్ధి సాధ్యమన్నారు. నీటితోనే ప్రగతి అన్నారు. తీరా కార్యాచరణ విషయానికి వచ్చేసరికి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జల సంరక్షణలో భాగంగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారం భించింది. వర్షాలు కురిసే నాటికి వివిధ నీటి సంరక్షణ పనులు చేపట్టేందుకు నీరు - ప్రగతి ఉద్యమాన్ని 90 రోజుల పాటు నిర్వహించాలని ప్రణాళిక రచిం చుకున్నారు. ఇందులో గొలుసుకట్టు చెరువుల అభివ ద్ధి, పంటకుంటలు, చెక్‌ డ్యామ్‌లు, కాంటూరు కందకాలు, చెరువుల పూడికతీత, మొక్కల పెంపకం, వూటకుంటలు, నేలలో తేమ పెంపు పనులు వంటివి చేపట్టనున్నారు. ఈ పనులను ఉపాధి హామీ నిధులతో డ్వామా, జలవనరుల, అటవీ, వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా చేపడుతున్నాయి. స్వచేంద సంస్థలు, ఇంజినీ రింగ్‌ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా స్పందన కొరవడింది. అయితే రాజధాని ప్రాంతంలోని క ష్ణా, గుంటూరు జిల్లాల్లో నేతలు, అధికారుల ఉదాశీనత కారణంగా పనుల్లో పురోగతి లోపి ంచింది. లక్ష్యాలైతే ఘనంగా నిర్దేశించుకున్నారు కానీ అమలు విషయంలో మా ఉత్సాహం లోపించింది. దీని ఫలితమే దాదాపు నెల రోజులు గడిచినా ఇంకా చాలా చోట్ల పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు కాకపోవడమే నిదర్శనం. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై మంత్రివర్గ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఇలాగే సాగితే పడిన వర్షపు నీరు వథాగా పోతుంది. యథావిధిగా తాగు, సాగునీటి కష్టాలు తప్పని పరిస్థితులు తలెత్తుతాయి.


ప్రణాళికకే పరిమితం...


కష్ణా జిల్లాలో మొత్తం రూ. 122.20 కోట్లతో 16 రకాల పనులను 90 రోజులలో చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. చిన్న నీటిపారుదల కింద ఆధ్వర్యంలో 32 గొలుసుకట్టు చెరువులను ఆధునికీకరించనున్నారు. దీని వల్ల వీటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరగనుంది. 55 చెక్‌డ్యామ్‌లను కూడా నిర్మించనున్నారు. 200 చెరువుల్లోని 46.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూడికను తొలగించనున్నారు. దుస్థితికి చేరిన చెరువుల గట్లను 12 లక్షల కూ.మీ మట్టితో పటిష్టపర్చనున్నారు. ఈ పనులకు రూ. 36 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. భారీ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 115.65 లక్షల చ.మీ మేర కంపను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 8 లక్షల ఘ.మీ మేర చెరువుల్లో పూడికను తొలగించనున్నారు. చెరువు గట్లను కూడా పటిష్టపర్చనున్నారు. తూములకు కాంక్రీట్ష వేయడంతో పాటు.. 139 తూము గేట్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో రూ. 43.82 కో ట్లు వెచ్చించనున్నారు. డ్వామా ఆధ్వర్యంలో 688 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, 12 వేల పంటకుంటలు, 75 లక్షల చ.మీ మేర కంప తొలగింపు, 21 చెరువుల్లో పూడికతీత, 325 చిన్న వూటకుంటల నిర్మాణం, తదితర పనులను చేపడతారు. ఈ పనులకు గాను రూ. 31 కోట్లు వెచ్చించనున్నారు. కొండవాలు ప్రాంతాల్లో రూ. 78.84 కోట్లతో 12 వేల కాంటూరు కందకాలను తవ్వను న్నారు. రూ. 3.75 కోట్లతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 32 వేల చిన్న వూట కుంటలను తవ్వాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూడా 83 పంట కుంటలను తవ్వబోతున్నారు. 500 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు 32 ఇంజినీరింగ్‌ కాలేజీలు ముందుకొచ్చాయి. వీటి నుంచి దాదాపు 1,940 మంది విద్యార్థులు పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు. గుంటూరు జిల్లాలో మొత్తం 1,450 పనులను వివిధ శాఖ భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయిం చారు. ఇక్కడ కూడా చెరువు గట్ల పటిష్టీకరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొక్కలు నాటడం, తూము గేట్ల మరమ్మతులు, తదితర వాటిని 90 రోజుల ప్రణాళికలో చేర్చారు. నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా వీటిని చేపడుతున్నారు. మొత్తం 1,025 చిన్న నిర్మాణాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 572, ఉపాధి హామీ కింద 453 పనులు జరగనున్నాయి. 243 మధ్య తరహా నిర్మాణాలలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో 115, అటవీ శాఖ కింద 128 ఉన్నాయి. పెద్ద పనులు మొత్తం 191 చేపట్టనున్నారు. వీటిలో 97 జలవనరుల శాఖ, 94 అట వీ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి.


వూపందుకుంటే ఒట్టు


రెండు జిల్లాల అధికారులు ఘనంగా 90 రోజుల ప్రణాళిక తయారు చేసు కున్నారు. అయితే పనుల గుర్తింపు, వాటికి అంచనాల తయారీ, పరిపాలనా పరమైన అనుమతుల విషయంలో మా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే 30 రోజులు గడిచాయి. పది శాతం పనులు కూడా పురోగతిలో లేవు. కష్ణా జిల్లాలో జలవనరుల శాఖ అధికారులు అంచనాల తయారీలో విపరీ తమైన జాప్యం చేశారు. మూడో వంతు వాటికి కూడా ఇవ్వలేకపోయారు. దీని వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. ఈపాటికే పరిపాలనా అను మతులు కూడా అయిపోతే పనులు వేగంగా జరిగేవి. కష్ణా జిల్లాతో పోలిస్తే గుంటూరు జిల్లాలో కొంత పురోగతి కనిపిస్తోంది. వర్షాలు ప్రారంభం అయితే చెరువుల్లో పూడికతీత, గట్లను పటిష్టం చేయడం కుదరని పని. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం విషయంలోనూ జాప్యం జరగుతోంది. ఇప్పటికే ఉపగ్రహం ద్వారా అనువ్కెన ప్రాంతాలను గుర్తించారు. తొలుత ఇష్టారీతిన పనులను గుర్తించారు. వీటికి అనుమతి లభించలేదు. హఠాత్తుగా నిబంధనలు మార్చారు. పనులను గ్రామ సభల్లో అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో మళ్లీ మొదటికి వచ్చింది.


పనుల కోసం నాయకుల పోటీ


50 ఎకరాలలోపు ఉండే వాటిని డ్వామా పర్యవేక్షణలో జరుగుతాయి. వీట ిని తప్పనిసరిగా కూలీలతోనే చేయించాల్సి ఉంటుంది. 50 ఎకరాలు దాటిన చెరువుల్లో పనులను జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com