తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులుతీరారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 66,714 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.2.78 కోట్లుగా ఉంది.