ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగలబడుతున్న అసోం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2019, 08:10 AM

కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఈశాన్య రా ష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి. కర్ఫూను ధిక్కరించి రోడ్లపైకి వచ్చిన జనాన్ని భ ద్రతా బలగాలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాయి. బలగాల కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మరణించారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ మేరకు గువాహతిలో మెడికల్ కాలేజీ అధికారులు ప్రకటించారు. ముఖ్యం గా అసోం, త్రిపుర రాష్ట్రాలు అగ్ని గుండంలా మారాయి. ఆందోళనలను అడ్డుకునేందుకు అసోంలో బుధవారం రాత్రినుంచి నిరవధిక కర్ఫూ విధించారు. అయినప్పటికీ గురువారం ఉదయం వేలాది మంది ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ధిక్కరించి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. నగరంలోని లాలుంగ్ గావ్ ప్రాంతంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతుండడంతో వారిని చెదరగొట్టడానికి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో పదుల సంఖ్యలో జనం గాయపడినట్లు ఆందోళనకారులు చెప్పారు. కాగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసి శాంతి భద్రతల కు భంగం కలిగించకుండా చూడడం కోసం రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలను అర్ధరాత్రినుంచి మరో 48 గం టలు పొడిగించినట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లఖింపూర్, ధేమజి, టిన్‌సుకియా, దిబ్రుఘర్, చారియా దేవ్, శివ్‌సాగర్, జోర్హట్, గోలాఘాట్, కామరూప్ (మెట్రో), కామరూ ప్ జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసినట్లు హోం శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కృష్ణ పిటిఐకి చెప్పారు.
ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో బుధవారం సాయం త్రం 7 గంటలనుంచి ఈ జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్ర భుత్వం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో పలు మార్పులు చేసి ంది. గువహటి పోలీసు కమిషనర్‌ను ఆ బాధ్యతలనుంచి తప్పించి ఆయన స్థానంలో మున్నాప్రసాద్ గుప్తాను నియమించా రు. అలాగే శాంతి భద్రతల విభాగం అదనపు డిజిపి ముకుల్ అగర్వాల్‌ను సిఐడి విభాగానికి బదిలీ చేసి జిపి సింగ్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మరింత ఉధృతం అవుతుండడంతో కేంద్ర అప్రమత్తమైంది. ఇప్పుడు అక్కడ మోహరించి ఉన్న బలగాలకు అదనంగా ఐదువేల మందిని పంపించాలని నిర్ణయించింది.నగరంలో ఉదయం 11 గంటలకు లతాశీల్ మైదానంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరహించడానికి ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఆసు) పిలుపునివ్వడంతో వందల సంఖ్యలో ప్రజలు నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా మైదానానికి చేరుకున్నారు. చిత్ర పరిశ్రమ, సంగీత పరిశ్రమతో పాటు వివిధ రం గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఆందోళనలో పా లు పంచుకున్నారు. బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి సోనోవాల్‌లు అసోం ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ఆసు సలహాదారు సముజ్జల్ భట్టాచార్య జనాన్ని ఉద్దేశించి అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినందుకు నిరసనగా ప్రతి ఏటా డిసెంబర్ 12న బ్లాక్ డే పాటిస్తామని ఆసు, నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (నెసో) నేతలు తెలిపారు.
ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ స్వస్థలమైన దిబ్రూగఢ్ లోని చబువాలో స్థానిక ఎంఎల్‌ఎ బినోద్ హజారికా నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. భవనంలో ఉన్న వాహనాలను కూడా తగులబెట్టారు. నగరంలోని సర్కిల్ కార్యాలయానికి కూడా వారు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. సోనిట్ పూర్‌లో మంత్రి రంజిత్ దత్తా ఇంటిపై ఆందోళనకారు లు దాడికి దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. గురువారం ఉదయం రాష్ట్ర పోలీసు చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత నగరంలో పర్యటిస్తున్న సమయంలో ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు.
క్రిస్టియన్ బస్తీ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో ఆందోళనకారులు వాహనాలపై రాళ్లు రువ్వారు. కామరూప్ జిల్లాలో ఆషీసులు, పాఠశాలలు, కాలేజిలు, షా పులు మూతపడ్డంతో బంద్ వాతావరణం కనిపించింది. జాతీయ రహదారి సహా అన్ని ప్రధాన రోడ్లపై వాహనాలేవీ తిరగలేదు. ఆందోళనకారులు రాళ్లు రువ్వి, రోడ్లపై టైర్లు తగులబెట్టడంతో రంగియా పట్టణంలో మూడు రౌండ్లు గాలిలోకి కా ల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గోలాఘాట్ జిల్లాలో ఎన్‌హెచ్ 39పై వాహనాలను అడ్డుకున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. లఖింపూర్, చారియా దేవ్, గోలాఘాట్ జిల్లాలోని నుమాలిఘర్, చారియాదేవ్ జిల్లాల్లో తేయాకు తోటల కార్మికులు సైతం పనులు నిలిపి వేసి నిరసన తెలియజేశారు.
రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో అయిదు కాలమ్‌ల సైనికులను సిద్ధంగా ఉంచడంతో పాటుగా గువహటి, తిన్‌సుకియా,జోర్హట్, డిబ్రూఘర్ జిల్లాల్లో సైన్యం ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానాలు, రైళ్లు రద్దు ఆందోళనల నేపథ్యంలో అసోంనుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు, రైళ్లను రద్దు చేశారు. కర్ఫూ కారణంగా గువహటి విమానాశ్రంలో వందలాది మంది ప్రయణికులు చిక్కుకున్నారు. నిరసనల కారణంగా ఆయా విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేయనున్నట్లు ప్రకటించాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అసోం, త్రి పుర రాష్ట్రాల్లో రైళ్లను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు.పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయుఎంఎల్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలో పేర్కొన్న స మానత్వ మౌలిక హక్కుకు ఇది వ్యతిరేకమని, మతం ప్రాతిపదికన ఒక వర్గం అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని న్యాయవాది పల్లవి ప్ర తాప్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో ఐయుఎంఎల్ ఆరోపించింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తున్న ఈ బిల్లు అమలు కాకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని అసోం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసామీలకు ఆయన ఒక వీడియో సందేశం వెలువరించారు. ఇక్కడి ప్ర జల భాష సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బంది ఉం డదని, రాజకీయాథికారం, భూమి హక్కులకు ఎటువంటి విఘాతం కల గబోదని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు సమా చారం అందించి ప్రజలను దారి మళ్లిస్తున్నారని, పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నారని విమర్శిం చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com