ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక హోదా ఇస్తానే మద్దతు అని షరతు పెట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 15, 2017, 02:12 AM

బాబు, జగన్‌కు రఘువీరారెడ్డి బహిరంగ లేఖ


విజయవాడ, మేజర్‌న్యూస్‌ః ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే త్వరలో జరిగే రాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి షరతు పెట్టాలని సీఎం చంద్రబాబుకు, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఏపీ పీసీసీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారంనాడు బాబు, జగన్మోహన్‌రెడ్డికి ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల ఆకాంక్ష అని, ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలన్నారు. హోదాపై రోజుకో నాటకం ఆడుతున్న పార్టీలను ప్రజలు గమని స్తూనే ఉన్నారని రఘువీరా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలో మీమీ నాయ కత్వాల్లోని అధికార పక్షమూ, ప్రతిపక్షమూ కలిసికట్టుగా  త్వరలో జరగనున్న రాష్ర్టపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్ధిని సంపూర్ణంగా బలపరుస్తామనే రాజకీయ విధానాన్ని ప్రకటించారని బాబు, జగన్‌ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశంపార్టీ, బిజెపి 2014 ఎన్నికల్లో పొత్తు కుదు ర్చుకుని బాబు, మోడీల జోడిని గెలిపించాలని, ఎన్డీయే కూటమిని గెలిపిస్తే 10 ఏళ్ళపాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని బిజెపి, కాదు 15ఏళ్ళపాటు ప్రత్యే క హోదా అమలు చేయాలని టిడిపి తరపున కోరుతున్నట్లు రాష్ర్ట ప్రజలకు హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. మీరు భాగస్వాములైన ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు పూర్తవుతున్నా ఎన్నికల మేనిఫెస్టోల్లో  ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రం అమలు చేయలేదని బాబుకు రాసిన లేఖలో ఆయన ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో రాష్ర్ట ప్రజలు పోరాటబాటపట్టారని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని  ఆందోళనలకు దిగారని గుర్తుచేశారు. ప్రజల ఆందోళనలకు తలొగ్గి రాష్ర్ట అసెంబ్లీలో రెండుస్లారు అధికార తెలుగు దేశం, బిజెపిలతోపాటు ప్రతిపక్షమైన వైసీపీ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారని కూడా ఆయన గుర్తుచేశారు. అయినప్పటికే నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, పునర్వవసీ ్థకరణచట్టంలోని అంశాలూ అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్న ఎన్డీయే నిర్ణ యంలో మీ (నారాచంద్రబాబునాయుడు) నాయకత్వంలోని తెలుగుదేశంపార్టీ  నేరుగా భాగస్వామ్యం వహించి రాష్ర్ట ప్రజల ఆకాంక్షను, హక్కును ఘోరంగా కాలరాసిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షపార్టీగా మీరు (జగన్‌మోహన్‌రెడ్డి )ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కొన్ని ఆందోళనలు చేస్తూ రాష్ర్ట ప్రజల్లో హోదాకోసం పోరాడుతున్నామన్న భరోసాను కల్పించే ప్రయత్నం చేసారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. కానీ అకస్మికంగా కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీని  కలిసి ఎప్పటినుంచో బిజెపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు, రాష్ర్టపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిని బలపరుస్తున్నట్లు ప్రకటించి రాష్ర్ట ప్రజను దిగ్భ్రాంతికి గురిచేశారని ఆయన గుర్తుచేశారు. పైకి ప్రత్యేకహోదా, భూసేకరణ చట్టం విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో ప్రయోజనకరమైన హోదాను, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా మోసం చేసిన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయేను బలపరచడం అంటే హోదా అంశాన్ని రాష్ర్ట ప్రయోజనాలను వదిలి మోడీకి మోకరిల్లారని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. మీ మీ వ్యక్తిగత స్వార్ధంకోసం, కేసుల కోసం ఇరువురూ ప్రధాని నరేంద్రమోడీకి మోకరిల్లారని ఒకరిపై ఒకరు ప్రెస్‌మీట్‌లుపెట్టి మరీ మీ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నా చివరకు మీరిద్దరూ కూడా మీమీ వ్యక్తిగత ప్రయోజనాలకోసమే నరేంద్రమోడీకి మోకరిల్లారని రాష్ర్ట ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ర్టపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును ప్రధాని కోరకుండానే, రాష్ర్టపతి అభ్యర్ధి ఎవరో ప్రకటించకుండానే మా మద్దుతు ఎన్డీయే అభ్యర్ధికేనని పార్టీ నేతగా మీరు ప్రకటించడం ప్రజలు ఊహిస్తున్న  అభిప్రాయాలు, అంచనాలూ నిజమనిపిస్తోందని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com