ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రుల మధ్య ముదురుతున్న వివాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 15, 2017, 02:14 AM

ఏలూరు, సూర్య ప్రత్యేక ప్రతినిధి : ‘మద్యానికి బానిసలై ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. తాడేపల్లిగూడెంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాం. ఈ మేరకు ఒక కమిటీని వేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టు షాపుల కొనసాగింపును అంగీకరించేదే లేదు’ ఇది దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల ప్రకటన’ ‘రాష్ర్టంలో మద్యపాన నిషేధం ఇంతకు ముందు ఒక ఫెయిల్యూర్‌ స్టోరీ. అందుకనే మా శాఖ బాధ్యతగా ప్రజల్లో కొంత అవగాహన కల్పిస్తాం. సామర్లకోటలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ ఇది ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌ మాట.  ఒకే విధానంపై ఇద్దరు మంు్తల్రది తలోమాట. పరస్పర వైరుధ్య ప్రకటనలు. ఇద్దరివీ వేర్వేరు పార్టీలు. అయినా ఒకటే జిల్లా. కాని మాటల్లోనే వివాదాలు రేగుతున్నాయి. అందున రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఒకే విధానం అమలు చేస్తారు. కాని మ్త్రిపక్షంలో ఉన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మ్త్రాం దీనికి భిన్నంగా తన నియోజకవర్గంలో మరో విధానాన్ని అమలు చేస్తామంటున్నారు. రానురాను ఈ వివాదం మరింత ముదిరేటట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఈ మధ్యనే కె.ఎస్‌.జవహర్‌ బాధ్యతలు స్వీకరించారు. వెనువెంటనే ఆయన కొత్త మద్యం విధానాన్ని ఈ ఏడాది అమలులోకి తెస్తామని ప్రకటించారు. పనిలోపనిగా ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై ఐదు లక్షలు పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. బెల్టు షాపులను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎక్సైజ్‌ మంత్రిగా ఈ ప్రకటన జారీ చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్పందించారు.అసలు తన నియోజక వర్గంలో ఎక్కడా బెల్టు షాపు ఉండేందుకు అంగీకరించనని, ఈ మధ్యనే తాను ఊరూవాడా తిరిగినప్పుడు స్థానిక ప్రజలు చెప్పిన కష్టాలు చూసి చలించి పోయానని, అవసరమైతే తానే బెల్టు షాపులు మూయించడంలో పోలీసుప్త్రా పోషిస్తానంటూ ప్రకటించారు. ఈ ప్రకటన సహజంగానే ఎక్సైజ్‌ వర్గాలను గుక్కతిప్పు కోనీయకుండా చేసింది. ఎక్కడా బెల్టు షాపులు ఉండనీయకపోవడం ప్రభుత్వ విధానం కూడా. దీనిపై మూడేళ్ళుగా అతి పెద్ద కసరత్తే జరిగింది. కొన్ని చోట్ల మహిళలు వీధులకెక్కి ధర్నాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. కాని మంత్రి మాణి క్యాలరావు ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి అసలు బెల్టు షాపులు ఎలా పెడతారు, వెంటనేమూసేయండి, లేదంటే నేనే రంగంలోకి దిగుతానంటూ హుకుం జారీ చేశారు. దీనిపై ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌ మౌనం దాల్చారు. అప్పటికప్పుడు స్పందించడం దేనికనేదే ఆయన వాదనగా వినిపించింది. కాని తాజాగా శనివారం దేవాదాయ మంత్రి మరో అడుగు ముందుకు వేశారు. తాడేపల్లిగూడెంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక్కడి నుంచే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నట్టు వెల్లడించారు. అలాగే బెల్టు షాపులు, మట్టి మాఫియా, స్వచేభారత్‌ వంటి అంశాలపై ఒక కమిటీని నియమించారు. ఈ విషయంలో కమిటీయే కీలకంగా వ్యవహరిస్తుందంటూ మంత్రి అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి రాష్ర్టంలో మద్యపాన నిషేధం అమలు విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం కొన్ని ఆర్థిక కష్టాలను అధిగమిస్తోంది. రాష్ర్టమంత్రివర్గంలో బాధ్యులైన వారికి ఈ విషయం తెలియదా అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకుముందు ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌ను రాష్ర్టంలో మద్యపానం నిషేధం అమలు చేసే అవకాశం ఏదైనా ఉందా అనే ప్రశ్నకు.. అదంతా ఒక ఫెయిల్యూర్‌ స్టోరీ అంటూ కామెంట్‌ చేశారు. అంటే రాష్ర్టంలో ఆబ్కారీ శాఖ ద్వారా వచ్చే ఆదాయం ఎంత మొత్తంలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఒకే మంత్రివర్గంలోను, అదే ఒకే జిల్లాలో ఉన్న మంు్తల్రు ఏదైనా కీలక ప్రకటన చేసే ముందు పరస్పరం చర్చించుకోవడం ఆనవాయితీ. కాని ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు మధ్య ఈ విషయంలో ఎలాంటి చర్చ జరగలేదు. బెల్టు షాపుల విషయంలో జరుగుతున్న అనర్దాలపైన మచ్చుకైనా వీరిద్దరూ పరస్పరం భేటీకాలేదు. తాను ఎక్సైజ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల వ్యవధిలోనే సొంత జిల్లాలోనే మరో మంత్రి నుంచి ఎదురుదాడి ప్రారంభం కావడం సహజంగానే జవహర్‌ను ఒకింత అసహ నానికి గురిచేసింది. ఈ విషయంలో ఏం చేద్దామనేదానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. మూడేళ్ళుగా తాడేపల్లిగూడెం నియోజక వర్గంలో ఉన్న బెల్టు షాపులు, ఇతర్త్ర వ్యవహారం మంత్రి ద ష్టికి ఇప్పటిదాకా రాలేదా అనేది మరో ప్రశ్న. టీడీపీ, బీజేపీలు స్నేహ పూరితంగా ఉన్నప్పుడు అలాంటి కోణాన్నే మంు్తల్ర మధ్య ఎందుకు ఆవిష్క తంకాలేదనేది ఇంకో ప్రశ్న. అయినదానికి కానిదానికి గూడెంలో టీడీపీ తమపై ఎదురుదాడి చేస్తుంది కాబట్టి దీనికి ధీటుగానే ఇక ముందు వ్యవహరించాలని మంత్రి మాణిక్యాలరావు ఒక నిర్ణయానికి వచ్చే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనేది చర్చకు వస్తుంది. సహజంగా ఒకే మంత్రివర్గంలో ఉన్న సభ్యులు పరస్పరం ఒకే వేదికమీదకు వస్తారు. ఏదైనా అంశం ఉంటే దానిపై అభిప్రా యాలు పరస్పరం వ్యక్తం చేస్తారు. కాని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మ్త్రాం దూకుడు ప్రదర్శించడం సహజంగానే టీడీపీ వర్గాల్లోనూ మరో అసహనాన్ని రేపింది. కాని మంత్రి మాణిక్యాలరావు అనుచరులు మ్త్రాం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, హోదా కలిగిన మంత్రిగా బాధ్యతలు మోస్తున్న నాయకుడు ప్రజల కష్టనష్టాలకు అనుకూలంగా పెదవి విప్పితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కాని ఇప్పటిదాకా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు మధ్య పరస్పరం విభేదం ఉంది. ఇది కాస్తా ముదిరి మంత్రి మాణిక్యాలరావు, మంత్రి జవహర్‌ మధ్య ఇప్పుడు కొత్తగా విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దష్టికి తీసుకువెళ్ళి తుది నిర్ణయంవైపు అడుగు వేయాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: గొల్ల, కుర్మ, యాదవ కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా చేయూతనందించేందుకు ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చేపట్టిన గొర్రెల పెంపకం పథకం ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా వేగం పుంజుకుంది. ఎంపికైన లబ్ధిదారులకు జూన్‌ చివరి వారంలో గొర్రెలను పంపిణీ చేసే దిశగా జిల్లా స్థాయి అధికారులు అడుగులు వేస్తున్నారు. గొర్రెల పంపిణీ  పథకంపై కేసీఆర్‌ ప్రత్యేకదృష్టి  సారించడంతో జిల్లా మంత్రులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధకశాఖమంత్రి  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఇటీవల జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ అధ్యక్షతన పశుసంవర్థకశాఖ జేడీ, ఇతర శాఖల అధికారులు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా  సమావేశమయ్యారు.  ప్రతి గొల్లకుర్మ కుటుంబానికి చెందిన సభ్యులు  గొర్రెల పంపిణీలో  పథకంలో లబ్ధిదారులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి  దిశానిర్ధేశం చేశారు. వీలైనంత త్వరగా సభ్యత్వం లేని గొల్లకుర్మలకు సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలని సూచించారు.  గ్రామాల్లో ఇప్పటి వరకు సంఘం రిజిస్ట్రేషన్‌ కాకపోతే వెంటనే నమోదు అయ్యేలా చూడాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,  అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఈ14వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో  సంఘాలు ఏర్పాటు, సభ్యత్వాల నమోదు ప్రక్రియను పూర్తిచేసి,  15వ తేదీ నుంచి గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రూపొదించుకుంటున్నారు. గ్రామ సభల్లోనే డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు గొల్లకుర్మలున్న ప్రతి గ్రామంలో సంఘం రిజిస్ట్రేషన్‌, పాత సంఘాల్లో 18 ఏళ్లు నిం డిన వారికి సభ్యుత్వ నమోదు ప్రక్రియను ఇప్పటికే దాదాపుగా పూర్తి  చేశారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సంఘాలు, సభ్యులు సంఖ్య తేలిన తర్వాత తిరిగి గ్రామాల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో, పశువైద్యశాఖధికారి, స్థానిక  సర్పంచ్‌లతో  కలిసి గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారు. సంఘం సభ్యులు, అధికారుల సమక్షంలో డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. తొలుత 50శాతం మంది సభ్యులకు గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించగా, మిగిలిన  50శాతం సభ్యులుకు వచ్చే ఏడాదికి గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రతి గ్రామంలో సంఘం నమోదు, 18ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సభ్యత్వ నమోదు తప్పనిసరిగా జరిగేలా చర్యలు అధికారులు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సం ఘంలో కనీసం 60 మంది సభ్యులు నుంచి 250 మంది వరకు సభ్యులు ఉండేవిధంగా చొరవ తీసుకుంటున్నారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మొదటి విడతకు గానూ వచ్చే నెల చివరి వారంలో రూ.1.25 లక్షల విలువ చేసే 20 గొర్రెలు, ఒక పొట్టెలును  లబ్ధిదారుడికి అందచేయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రా పద్ధతి ద్వారా ఎంపికైన లబ్ధిదారుడు తన వాటా ధనంగా రూ. 31250 (25శాతం) చెల్లిస్తే మిగితా 93750 (75శాతాన్ని)సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com