ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుందర పట్టణాలకు ప్రణాళిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 02:15 AM

- హరితతోరణం అమలుకు కార్యాచరణ 


- వారం రోజుల్లో పారిశుద్ధ్య వర్క్‌ కాంట్రాక్ట్‌కు టెండర్లు 


- పురపాలక సంఘాల్లో సమూల మార్పులకు శ్రీకారం


(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : నూతన రాజధాని ప్రాంతంలో పట్టణాలను అభివ ద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అమరావతి పరిధిలో నగరాలు, పట్టణాలను పచ్చదనంతో సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని, రహదారులను పునర్నిర్మించి, డివ్కెడర్లు ఏర్పాటు చేసి మధ్యలో మొక్కలు పెంచటం, పౌరులకు మౌలిక వసతులు కల్పించాలని పురపాలక, పట్టణాభివ ద్ధిశాఖ రెండు రోజుల పాటు విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో కమిషనర్లు, ఇంజినీర్లకు పురపాలక ముఖ్య కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ దిశానిర్ధేశం చేశారు. వచ్చే రెండేళ్లలో చేపట్టే పనుల అమలుపై నివేదిక తయారు చేసి పంపాలని సూచించారు.


రెండేళ్లలో ఆదాయ వనరులు, వ్యయంపైనా నివేదిక


పట్టణాల్లో రెండేళ్లలో సమకూరే ఆదాయం, కార్యాచర ప్రణాళిక ప్రకారం అభివ ద్ధికి కావాల్సిన నిధులు ఎంత వరకు అవసరమనే దానిపై కమిషనర్లు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆదాయం ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వమే నిధులు కేటాయించటానికి ముందుకు వస్తోంది. ప్రస్తుతం పురపాలక సంఘాల్లో అందుబాటులో ఉన్న నిధులతో పాలకపక్షాలు తమకు ఇష్టమైన ప్రాంతాల్లో రహదారులు వేయటం, వేసిన రోడ్డుపైనే మళ్లీ నిర్మాణాలు చేసి నిధులు వ థా చేస్తున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళిక పకడేందీగా రూపొందించి ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్లకు దిశానిర్ధేశం చేశారు. ఈ ప్రదిపాదనపై పురపాలక సంఘాల్లో కౌన్సిల్‌ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా నచ్చజెప్పే బాధ్యతను కమిషనర్‌, ఇంజినీరుకు అప్పగించారు. కౌన్సిల్‌ సభ్యుల అభ్యర్థన ప్రకారం 40 శాతం నిధులు వారి ఇష్టప్రకారం ఖర్చు చేయటానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. కార్యాచరణ ప్రణాళిక త్వరగా అందజేయటానికి ప్రత్యేక బ ందాలు వార్డుల్లో తిరిగి రూపకల్పన చేస్తున్నారు.


ప్రజారోగ్య కార్యక్రమాల అమలుకు ఆదేశం


ప్రజారోగ్య కార్యక్రమాలు సమర్ధంగా నిర్వహించటానికి చర్యలకు ఉపక్రమించాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రైవేటు పారిశుద్ధ్య కార్యక్రమాలకు బదులు వర్క్‌ కాంట్రాక్ట్‌ విధానం తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రక్రియ అమలుకు ఏడాదిన్నర కిందటే జీ.వో.279 విడుదల చేసింది. జీ.వో. ప్రకారం వర్క్‌ కాంట్రాక్ట్‌ విధానం తీసుకురావటానికి గత ఏడాది ప్రణాళిక రూపొందించి అమలు చేయటానికి ఆయా పురపాలకసంఘాల కౌన్సిల్‌ ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి తీర్మానాలు పంపాయి. జీ.వో.279 అమలు చేసే విధంగా వర్క్‌ కాంట్రాక్ట్‌ పద్ధతి కోసం వారం రోజుల్లో టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం అన్ని పురపాలకసంఘాల కమిషనర్లను ఆదేశించింది. ఆన్‌లైన్‌ టెండర్ల విధానంతో పట్టణాల్లో ప్రజారోగ్య కార్యక్రమాలకు వర్క్‌ కాంట్రాక్ట్‌ ఇస్తారు.


రంగంలోకి దిగిన అధికారులు


రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల అమలుకు రాజధాని అమరావతిలోని పురపాలకసంఘాల అధికారులు కార్యరంగంలోకి దిగారు. వచ్చే రెండేళ్లలో ఏఏ అభివ ద్ధి పనులు చేపట్టాలనే దానిపై సర్వే కార్యక్రమానికి కమిషనర్‌లు, ఇంజినీర్లు శ్రీకారం చుట్టారు. పనిచేయని అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అధికారులను తొలగించటానికి కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com