ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హై స్పీడ్గ ట్రైన్‌ ప్రాజెక్టుపై చైనా ఆసక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2017, 03:11 AM

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : అమరావతి రాజధానికి మణిమకుటాయమైన విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి హై స్పీడ్గ సర్క్యులర్‌ ట్రైన ప్రాజెక్టుపై చైనా ఆసక్తి చూపిస్తోంది. హై స్పీడ్గ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకునేందుకు ‘చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కంపెనీ’ (సీఆర్‌ఆర్‌సీ) సంసిద్ధమైంది. మలేషియాలో ఇలాంటి ప్రాజెక్టునే చేపడుతున్న సీఆర్‌ఆర్‌సీ రాజధాని ప్రాంతంలో చేపట్టేబోయే ఈ ప్రాజెక్టుపై కూడా దష్టి సారించటంతో ఆ కంపెనీని ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన (ఏఎంఆర్‌సీ) ఎండీ ఎనవీ రామక ష్ణారెడ్డి ఆ బ ందంతో సమావేశమైంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో చేపట్టే హై స్పీడ్గ రైల్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఇందుకు విదేశీ ఆర్థిక సంస్థల అవసరం కాబట్టి చైనాకి చెందిన సీఆర్‌ఆర్‌సీ ఆసక్తి చూపటాన్ని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన(ఏఎంఆర్‌సీ) ఆహ్వానించింది. విజయవాడలోని ఏఎంఆర్‌సీ ప్రధాన కార్యాలయంలో ఎండీతో సీఆర్‌ఆర్‌సీ బందం సమావేశమైంది. సీఆర్‌ఆర్‌సీ అధికార బ ందంలో డిప్యూటీ డైరెక్టర్‌ కావ్‌ యాన, ఉపాధ్యక్షుడు ఝాంగ్‌ మిన్యూ, డిప్యూటీ డైరెక్టర్‌ డీగాంగ్‌ యూన, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాంగ్‌లు ఉన్నారు. విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నగరాలను అనుసంధానం చేసే హైస్పీడ్‌ సర్క్యులర్‌ ట్రైనప్రాజెక్టుపై ఏఎంఆర్‌సీ ఎండీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ఇచ్చారు. రాష్ర్ట విభజన చట్టం మేరకు విజయవాడకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ ప్రాజెక్టును మంజూరు చేసిందని, రాష్ర్ట ప్రభుత్వం దీనిని అమరావతి రాజధానికి కూడా విస్తరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఫీజుబిలిటీకి అవకాశాలు ఉండటంతో దానికి డీపీఆర్‌ పూర్తి చేసి ప్రాజెక్టు పనుల ప్రక్రియ ప్రారంభించటం జరిగిందన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితులలో రాజధానికి మెట్రో రైల్‌ ప్రాజెక్టు వయబిలిటీ కాదని డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన (డీఎంఆర్‌సీ) రిపోర్టు ఇవ్వటం, హై స్పీడ్గ రైల్‌ ప్రాజెక్టుకు సిఫార్సు చేసిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నగరాలను హై స్పీడ్గ రైల్‌ ప్రాజెక్టుతో అనుసంధానం చేయాలని నిర్ణయించటంతో డీఎంఆర్‌సీ సంస్థ దీనికి సంబంధించి డీపీఆర్‌ బాధ్యతలను అప్పగించటం జరిగిందన్నారు. అర్బన మాస్‌ ట్రాన్సపోర్టు కంపెనీ(యుఎంటీసీ) సంస్థ దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారు చేస్తోందని చెప్పారు. సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? హై స్పీడ్గ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రక్రియ ప్రారంభించటం సాధ్యమౌతుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం దీనిని ప్రైవేట్‌ అండ్గ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్మించాలని నిర్ణయించవచ్చని లేని పక్షంలో డీపీఆర్‌ వచ్చిన తర్వాత రాష్ర్ట క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపించటం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిసే ్త ప్రాజెక్టుకు నిధులకు సంబంధించి రెండు ప్రభుత్వాల వాటాను డీపీఆర్‌ ప్రకారం నిర్దేశించటం జరుగుతుందన్నారు. మిగిలిన వాటాను విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్ళటం జరుగుతుందని చెప్పారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషనను వీక్షించిన తర్వాత చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కంపెనీ తమ అనభవాలను వివరించింది. చైనా అధికార బ ంద సభ్యులు మాట్లాడుతూ మలేషియాలో తాము ఇలాంటి హై స్పీడ్గ రైల్‌ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని వివరించారు. దీనికి రామక ష్ణారెడ్డి స్పందిస్తూ తమ ప్రాజెక్టు కూడా 100 కిలోమీటర్ల నిడివి ఉంటుందని, స్పీడ్గకు సంబంధించి తాము ఇంకా మార్గనిర్దేశనం చేసుకోలేదన్నారు. ఈ సందరేంగా సీఆర్‌ఆర్‌సీ బంద సభ్యులు హై స్పీడ్గ రైల్‌కు సంబంధించిన ఒక మోడల్‌ను, ఏఎంఆర్‌సీ రామక ష్ణారెడ్డికి బహుకరించారు.


బంద సభ్యుల చర్చలు సఫలం : హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుపై ఏఎంఆర్‌సీ, సీఆర ్‌ఆర్‌సీ బంద సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రాజెక్టు అంకుర దశలో చైనాకు చెందిన ప్రతిషాత్మక సీఆర్‌ఆర్‌సీ సంస్థ ముందుకు రావటంతో ఏఎంఆర్‌సీ ఆ సంస్థను తమ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టు ఏఎంఆర్‌సీ ఎండీ చెప్పారు. ఒక వేళ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నా విదేశీ ఆర్థిక సంస్థల అవసరం ఉంటుంది. దీనిని ద ష్టిలో ఉంచుకుని సీఆర్‌ఆర్‌సీ సంస్థను భాగస్వామ్యం చేయాలని ఏఎంఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించేందుకు చ ర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com